పాట్నా, మార్చి 29: బీహార్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్బంధన్ కూటమిలో శుక్రవారం లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకం కుదిరింది. ఆర్జేడీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీపీఐ, సీపీఎంకు చెరొక సీటు కేటాయించారు.గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీ ఈసారి అదనంగా తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది.
ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మనోజ్‌కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేశ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సీట్ల పంపకం ఏకగ్రీవంగా జరిగిందని చెప్పారు.