ముంబై, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. జనవరిలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 246 మున్సిపల్ కౌన్సిల్లు, మున్సిపల్ పంచాయతీలకు షెడ్యూల్ను ప్రకటించింది.
డిసెంబర్ 2న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.