న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దివ్యాంగ యువ పారిశ్రామికవేత్తలు, వ్యక్తులకు నిరంతరాయంగా రుణాలను అందుబాటులోకి తెచ్చే ఒక మొబైల్ యాప్ ఆదివారం ప్రారంభమైంది. జాతీయ దివ్యాంగ్జన్ ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్(ఎన్డీఎఫ్డీ సీ) రూపొందించిన ఈ మొబైల్ యాప్ను 22వ దివ్య కళా మేళా ముగింపు ఉత్సవంలో ప్రారంభించారు.
దివ్యాంగ యువ వ్యాపారవేత్తలు, వ్యక్తులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ యాప్ లక్ష్యమని అధికారులు తెలిపారు. వారికి అందుబాటులో ఉండే రుణాల వివరాలను ఈ యాప్ నిరంతరాయంగా అందజేస్తుంది.