పాట్నా: బీహార్‌లోని ఒక కౌంటింగ్ కేంద్రంలో లారీలు కనిపించాయి. దీంతో ఈవీఎంలను వాటిలో తీసుకువచ్చినట్లు ఆర్జేడీ ఆరోపించింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు విమర్శించింది. ( Truck Loaded with EVMs ) దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది. గురువారం సాయంత్రం ససారాం కౌంటింగ్ కేంద్రంలోకి ఈవీఎంలతో కూడిన లారీలు వచ్చినట్లు ఆర్జేడీ ఆరోపించింది.
కాగా, రోహ్తాస్ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా ఎన్నికల అధికారి ఉదిత సింగ్ ఈ ఆరోపణలను ఖండించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన లారీల్లో ఖాళీ స్టీల్ బాక్సులున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం ప్రవేశద్వారం వద్ద వాటిని తనిఖీ చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు, వారి మద్దతుదారుల సమక్షంలో ఈ తనిఖీ జరిగిందని, వీడియో కూడా రికార్డ్ చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్ రోజున ఎన్నికల అధికారులు, అభ్యర్థుల సమక్షంలోనే ఈవీఎం బాక్స్‌లను తెరుస్తామని అన్నారు.
कथित तौर पर EVM से भरा हुआ ट्रक सासाराम (रोहतास जिला) के मतगणना केंद्र बिना किसी पूर्व सूचना और पारदर्शिता के जिला प्रशासन द्वारा क्यों घुसाया गया?
ट्रक चालकों को सामने लाए बिना क्यों भगा दिया गया?
2 बजे से यहां CCTV कैमरा का फीड क्यों बंद रहा?
पूरा फुटेज जारी किया जाए!
ट्रक में… pic.twitter.com/QzeA3MxlHF— Rashtriya Janata Dal (@RJDforIndia) November 12, 2025
Also Read:
Sena leader Sells footpath | పానీపూరీ విక్రేతకు.. ఫుట్‌పాత్ స్థలం అమ్మిన శివసేన నేత
explosion at firecracker factory | బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
Watch: కారు తనిఖీ చేసిన పోలీసులు.. డిక్కీలో నిద్రిస్తున్న వ్యక్తిని చూసి షాక్