Liquor Scam | ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్ పాఠక్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 11న విచారణ జరుగనున్నది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్‌ను విడుదల చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఆయనకు కోర్టు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జులై 14న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. ప్రస్తుతం సీబీఐ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు.
CM Mamata Banerjee: నిందితుడికి మరణశిక్ష విధించాలి.. సీబీఐని డిమాండ్ చేసిన దీదీ
Rado Watch | అభిమానికి రాడో వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేసిన లులు గ్రూప్ చైర్మన్.. వీడియో