Rado Watch | లులు గ్రూప్ చైర్మన్ (Lulu Group chairman) ఎంఏ యూసఫ్ అలీ (MA Yusuff Ali) తన అభిమానికి బిగ్ సర్ప్రైజ్ (Surprise) ఇచ్చారు. ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యూట్యూబర్ ఎఫిన్ ఎం ఇటీవలే లులు గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లులు చైర్మన్.. యూట్యూబర్‌కు స్వాగతం పలికారు. ఇద్దరూ కాసేపు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా యూట్యూబర్‌కు బిలియనీర్ ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతిని ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. రాడో వాచ్ (Rado Watch)ను సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. రాడో వెబ్సైట్ ప్రకారం.. ఈ వాటర్‌ప్రూఫ్ వాచ్ ధర రూ.2 లక్షల వరకూ ఉంటుంది. ఈ వీడియోను యూట్యూబర్ ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ.. ‘అలీ సర్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
Also Read..
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం
Chandrababu | ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి.. ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు
Hemant Soren | రాహుల్, ఖర్గేతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ