Hemant Soren | రాహుల్, ఖర్గేతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ
Hemant Soren : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
Hemant Soren : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. తాను కాంగ్రెస్ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశానని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.
ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను వీరిని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై తాము చర్చిస్తామని తెలిపారు. తాము పూర్తి బలంతో జార్ఖండ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక హేమంత్ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీలో పాలుపంచుకున్నారు. కాగా, అంతకుముందు జార్ఖండ్ సీఎం సోరెన్ రాజస్ధాన్‌లోని అజ్మీర్‌లో సూఫీ సన్యాసి ఖ్వాజా గరీబ్ నవాజ్‌ను సందర్శించారు. రాష్ట్రం, దేశం సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కాగా జేఎంఎం సీనియర్ నేత, జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం హేమంత్ సోరెన్‌తో పాటు పాలక జేఎంఎంకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
Read More :
Sheikh Hasina | షేక్ హసీనాపై మరో ఐదు హత్య కేసులు నమోదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

