శుక్రవారం 05 జూన్ 2020
National - May 14, 2020 , 06:37:36

ఎమ్మెల్యే కారులో మ‌ద్యం బాటిళ్లు..

ఎమ్మెల్యే కారులో మ‌ద్యం బాటిళ్లు..

బీహార్: ఓ వైపు లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో బ‌క్స‌ర్ ఎమ్మెల్యే సంజ‌య్ కేఆర్ తివారి కారులో పోలీసులు మ‌ద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే సంజ‌య్ కేఆర్ తివారి మాట్లాడుతూ..రేష‌న్ స‌రుకులు పంపిణీ చేసేందుకు నా కారును ఉప‌యోగించారు. బుధ‌వారం నా కారు జ‌గ‌దీష్ పూర్ లో రేష‌న్ పంపిణీ కోసం వెళ్లింది. అయితే నా కారు సిమ్రీకి ఎలా వెళ్లిందో తెలియ‌దు. రేష‌న్ పంపిణీ చేసేందుకు వెళ్లిన వారితో మాట్లాడ‌లేదన్నారు.

బ‌క్స‌ర్ ఎస్పీ మాట్లాడుతూ..ఉపేంద్ర‌నాథ్ శ‌ర్మ మాట్లాడుతూ..వాహ‌న యాప్  త‌నిఖీల్లో భాగంగా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. మ‌ద్యం బాటిళ్ల‌కు సంబంధించి న‌లుగురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నాం. కారు య‌జమానితోపాటు న‌లుగురు వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo