LSG vs CSK | లక్నో ధమాకా.. సీఎస్కేపై వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం
LSG vs CSK | ఇటీవలే సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఓటమి రుచి చూపించిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు షాకిచ్చింది.
- స్టోయినిస్ అజేయ శతకం
- రుతురాజ్, దూబే మెరుపులు వృథా
ఇటీవలే సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఓటమి రుచి చూపించిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టుకు షాకిచ్చింది. వేదిక మారినా చెన్నైకి ఓటమి తప్పలేదు. పెట్టని కోట లాంటి చెపాక్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రుతురాజ్ గైక్వాడ్ అజేయ శతకానికి తోడు దూబే సిక్సర్లతో చెన్నై బ్యాటింగ్‌లో 210 పరుగులు చేసినా వాటిని కాపాడుకోలేకపోయింది. లక్నో డేంజరస్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ దంచికొట్టడంతో సొంత ఇలాఖాలో చెన్నై చిత్తైంది. ఈ విజయంతో లక్నో నాలుగో స్థానానికి చేరుకోగా, చెన్నై ఐదులో ఉంది.
చెన్నై : డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. ఈనెల 19న లక్నోలో చెన్నైని ఓడించిన కెఎల్ రాహుల్ సేన.. మంగళవారం సీఎస్కే సొంతగడ్డపైనా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్, 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీకి తోడు శివమ్ దూబే (27 బంతుల్లో 66, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ‘లక్నో హల్క్’ మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్, 13 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారంతో ఆ జట్టుకు 19.3 ఓవర్లలోనే విజయాన్ని కట్టబెట్టాడు. స్టోయినిస్కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

గైక్వాడ్ శతకం.. దూబే దుమారం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై ఆదిలోనే రహానే (1) వికెట్, డారిల్ మిచెల్ (11) వికెట్లను కోల్పోయినా రుతురాజ్ మాత్రం బౌండరీలతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జడేజా (16) నిష్క్రమణ తర్వాత వచ్చిన దూబే బాదుడుతో సీఎస్కే ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. స్టోయినిస్ వేసిన 13వ ఓవర్లోనే తొలి సిక్సర్ బాదిన అతడు.. యశ్ ఠాకూర్ 16వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తర్వాత బాధితుడు మోహ్సిన్ ఖాన్. 19వ ఓవర్లో 6,4,6తో 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేశాడు. అంతకంటే ముందే ఠాకూర్ వేసిన 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4 తో 56 బంతుల్లోనే శతకం పూర్తిచేశాడు.
స్టోయినిస్ షో..
భారీ ఛేదనలో లక్నో ఇన్నింగ్స్ మూడో బంతికే ప్రమాదకర ఓపెనర్ క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ (16) కూడా విఫలమయ్యాడు. ఏడు ఓవర్లు ముగిసేపటప్పటికీ ఆ జట్టు చేసింది 51 పరుగులే. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన స్టోయినిస్ చాలాకాలం తర్వాత బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లోనే 50 పరుగులు పూర్తిచేసిన అతడు.. నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో రెచ్చిపోయాడు. 34 బంతుల్లోనే 70 పరుగుల ఈ భాగస్వామ్యానికి పతిరాన తెరదించినా స్టోయినిస్ మాత్రం దంచికొట్టాడు. 56 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసిన అతడు.. ఆఖరి ఓవర్లో 15 రన్స్ రాబట్టి లక్నోకు విజయాన్ని అందించాడు.
1 పురుషుల టీ20 క్రికెట్లో అత్యధికసార్లు 200 ప్లస్ స్కోరు చేసిన జట్లలో చెన్నై.. సోమర్సెట్ రికార్డును సమం చేసింది. ఈ రెండు జట్లూ ఏకంగా 34 సార్లు రెండు వందలకు పైగా స్కోరు చేశాయి. భారత్(32), ఆర్సీబీ, యార్క్‌షైర్(29) ఆ తర్వాత ఉన్నాయి.
2 లక్నో తరుఫున ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా స్టోయినిస్ (124) నిలిచాడు. క్వింటన్ డికాక్(140*)
టాప్‌లో ఉన్నాడు.
3 ఈ ఐపీఎల్లో ఒక మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదు కావడం ఇది మూడోసారి. ఆర్ఆర్ X ఆర్సీబీ, కేకేఆర్ X ఆర్ఆర్ మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి.
124 ఐపీఎల్ లక్ష్యఛేదనలో లక్నో బ్యాటర్ స్టోయినిస్దే అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు పాల్ వాల్తటీ(120*), సెహ్వాగ్(119), శాంసన్(119) జాబితాలో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై : 20 ఓవర్లలో 210/4 (రుతురాజ్ 108 నాటౌట్, దూబే 66, హెన్రీ 1/28, ఠాకూర్ 1/47).
లక్నో : 19.3 ఓవర్లలో 213/4 (స్టోయినిస్ 124 నాటౌట్, పూరన్ 34, పతిరాన 2/35, చాహర్ 1/11)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

