Life Time | న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మానవుల సగటు ఆయుర్దాయం 2050 నాటికి 5 ఏండ్లు పెరుగుతున్నదని ‘లాన్సెట్’ జర్నల్ నివేదిక వెల్లడించింది. స్త్రీ పురుషులు జీవితకాలం 73.6 ఏండ్ల నుంచి 78.1 ఏండ్లకు పెరిగే అవకాశముందని (2050 నాటికి) నివేదిక అంచనా వేసింది.
అంటువ్యాధుల నివారణలో వైద్య చికిత్సలు అందుబాటులోకి రావటం భారత్లో జీవితకాలం పెరగడానికి దారితీస్తున్నదని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంటువ్యాధుల ఉధృతి తగ్గొచ్చునని, వ్యాక్సినేషన్, పోషకాహారం, వైద్య విధానాలు ధనిక దేశాల్లో సగటు జీవితకాలం పెంచుతుందని నివేదిక తెలిపింది.