పానిపట్: మహిళలకు ఆర్థిక సాధికారిత కల్పించేందుకు ఎల్ఐసీ బీమా సఖి యోజనను ప్రధాని మోదీ హర్యానాలోని పానిపట్లో సోమవారం ప్రారంభించారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత అర్హతగా కలిగిన 18-70 ఏండ్ల మధ్య వయసు గల మహిళలు ఎల్ఐసీ ఏజెంట్లు అయ్యేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది.
ఈ పథకం ద్వారా ఒక లక్ష మంది మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, ఆర్థిక అక్షరాస్యత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకంలో అర్హులైన మహిళలకు మూడేండ్ల పాటు స్టెపెండ్ పొందే అవకాశం కలిగిన శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేస్తూ పాలసీల అమ్మకం ద్వారా కమీషన్లు పొందవచ్చు.