కొచ్చి: చంద్రయాన్-3 సక్సెస్తో చరిత్ర సృష్టించిన ఇస్రో.. రోవర్ ప్రజ్ఞాన్ను తిరిగి మేల్కొపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిద్రాణ స్థితి నుంచి రోవర్ మేల్కొనే అవకాశముందని ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం ఆయన మాట్లాడుతూ, ‘చంద్రయాన్-3 మిషన్లో ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ నుంచి రావాల్సిన డాటా అంత వచ్చేసింది. అనుకున్న విధంగా పరీక్షలు చేపట్టాం. ప్రస్తుతం నిద్రాణ స్థితి లో ఉంది. తిరిగి తప్పకుండా మేల్కొంటుందన్న ఆశ మాత్రం ఉంది’ అని అన్నారు.