Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మే 7వ తేదీన విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌లో దాయాదికి భారీ నష్టం వాటిల్లింది. భారత్ చేపట్టిన దాడులకు పాక్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ఆపరేషన్‌కు సంబంధించిన కీలక విషయాలను ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ (Air Marshal Narmdeshwar Tiwari) తాజాగా పంచుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 50 కంటే తక్కువ ఆయుధాలనే (Less Than 50 Weapons) వినియోగించినట్లు చెప్పారు.
ఓ జాతీయ మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘పాక్‌తో ఘర్షణలు ఆపేందుకు ఐఏఎఫ్ చాలా తక్కువ ఆయుధాలనే వినియోగించింది. ఈ ఆపరేషన్‌లో 50 కంటే తక్కువ ఆయుధాలతోనే పాక్‌తో ఘర్షణలను ఆపగలిగాం. మన బలగాలు నియంత్రణ రేఖ వెంట అత్యంత కచ్చితత్వంతో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‌లోని లక్ష్యాలను ఛేదించాయి. ఈ దాడులకు తట్టుకోలేక పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. మే 10న పాకిస్థాన్ సీజ్‌ఫైర్‌కు దిగొచ్చింది. యుద్ధాన్ని ప్రారంభించడం చాలా సులభం. కానీ దాన్ని ముగించడం అంత సులువైన పని కాదు. అందుకే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా మన బలగాలను సంసిద్ధంగా ఉంచాం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read..
Amit Shah | లాల్బాగ్చా రాజాను దర్శించుకున్న అమిత్ షా.. VIDEO
Cloudburst | ఉత్తరాది రాష్ట్రాల్లో జలవిలయం.. షాకింగ్ వీడియోలు
RCB | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ కీలక ప్రకటన