Amit Shah | దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో ఈ వేడుకలు ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. తాజాగా ముంబై నగరంలోని ఫేమస్ లాల్ బాగ్చా రాజా (Lalbaugcha Raja)ను కేంద్ర హోం మంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) దర్శించుకున్నారు. లాల్ బాగ్చా మార్కెట్లో కొలువుదీరిన ఈ భారీ గణనాథుడిని షా తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముంబైలో గణేశ్ చతుర్థి అంటే ముందుగా గుర్తొచ్చేది ‘లాల్బాగ్చా రాజా’ (Lalbaugcha Raja) గణనాథుడు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహా గణపతి ఎంత ఫేమస్సో ముంబై వాసులకు ఈ గణనాథుడు అంత ఫేమస్. 1934 నుంచి లాల్బాగ్చా మార్కెట్లో కొలువుదీరే ఈ గణనాథుడి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. సినీ సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ గణనాథుడిని దర్శించుకుంటుంటారు.
#WATCH | Mumbai, Maharashtra: Union Home Minister Amit Shah, along with his son ICC chairman Jay Shah and the rest of the family, has the darshan of Lord Ganesh at Lalbaugcha Raja and offers prayers here. pic.twitter.com/3uawryruPB
— ANI (@ANI) August 30, 2025
Also Read..
Cloudburst | ఉత్తరాది రాష్ట్రాల్లో జలవిలయం.. షాకింగ్ వీడియోలు
RCB | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ కీలక ప్రకటన
Cloudburst | జమ్ము కశ్మీర్లో క్లౌడ్‌బరస్ట్.. 11 మంది మృతి