న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) చుట్టూ తిరుగుతుండటంతో ఇప్పుడు దీనిని న్యాయరంగం కూడా అందిపుచ్చుకుంటున్నది. త్వరగా తీర్పులు ఇచ్చేందుకు, చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసులు, భూ వివాదాలు పరిష్కరించేందుకు న్యాయ వ్యవస్థలో తొలిసారి కృత్రిమ మేధస్సు (ఏఐ)ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ రోబో న్యాయమూర్తుల ఆలోచన దేశ న్యాయ వ్యవస్థ స్వరూపాన్నే మార్చివేసే అవకాశం ఉంది.
ఈ వినూత్న కార్యక్రమం కింద జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తులకు ఏఐ సాయంతో తీర్పులు ఇవ్వడంపై శిక్షణ ప్రారంభించారు. విదేశాల్లో ఈ వ్యవస్థ ఎలా విజయవంతమైందో తెలుసుకునేందుకు వారిని అక్కడికి పంపిస్తున్నారు. అయితే, రోబో న్యాయమూర్తులు అంటే కోర్టు బెంచీలపై కూర్చునే రోబోలు కాదు, ఇది ఒక భావన మాత్రమే. కేసు నేపథ్య వివరాలు, మునుపటి తీర్పులను క్రోడీకరించి న్యాయమూర్తులకు వేగంగా తీర్పులు ఇవ్వడంలో సహాయపడేందుకు ఏఐను ఉపయోగించ డం.ఈ విధానం చిన్నచిన్న నేరా లు, ట్రాఫిక్, భూ వివాదాలు వం టి కేసులకు మాత్రమే వర్తిస్తుంది.