ఖమ్మం: రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ వామపక్ష రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwara Rao) వామపక్ష నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం కలెక్టరేట్ ముందు కమ్మూనిస్టు పార్టీకి చెందిన యూనియన్లు ధర్నా నిర్వహిస్తున్నాయి.
అదే సమయంలో కలెక్టరేట్‌కు వెళ్తున్న మంత్రి తుమ్మలను అడ్డుకున్నారు. దీంతో కారు దిగి వారి వద్దకు వెళ్లిన ఆయనను కొందరు రుణమాఫీ విషయమై నిలదీశారు. అందరికీ మాఫీ చేయాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉందని ప్రకటించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అవుతుందని తెలిపారు. అందరికీ మాఫీ వర్తింపజేస్తామని చెప్పారు.