న్యూఢిల్లీ: ఐటీ, ఇతర రంగాల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉంది. జూన్ తొలి వారంలో 1400 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓర్కమ్, ఒడా తదితర సంస్థలు ఉద్యోగులకు పింక్ స్లిప్లను అందించాయి.
హోల్లెన్స్ 2, అజుర్ మూన్ షాట్స్ విభాగాల్లో వెయ్యి మందికిపైగా ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు వేసింది. సంస్థ పునర్ నిర్మాణం, వ్యయ నియంత్రణలో భాగంగా వీరిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.