న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. నగరంలో రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరిగిపోతున్నది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగకు తోడు, పంజాబ్ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత కూడా ఢిల్లీకి శాపంగా మారింది. దాంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర స్థాయికి పెరిగిపోతున్నది. ఆదివారం ఉదయం ఢిల్లీలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 393 గా ఉన్నది.
ఇవాళ ఉదయం 7 గంటలకు జహంగీర్‌పురి ఏరియాలో అత్యధికంగా 450 ఏక్యూఐ నమోదైంది. బవానా (AQI-437), అశోక్ విహార్ (AQI-434), ఆనంద్ విహార్ (AQI-433) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ స్థాయిల వాయు కాలుష్యాన్ని తీవ్ర కాలుష్యంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఐటీవో ప్రాంతంలో 382, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర 360 ఏక్యూఐ నమోదైంది. అంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉన్నదని అర్థం.
కాగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉంటే దాన్ని కాలుష్య రహిత వాతావరణంగా చెప్పవచ్చు. ఏక్యూఐ 100 నుంచి 200 వరకు ఉంటే ఓ మోస్తరు కాలుష్యంగా పేర్కొంటారు. ఏక్యూఐ 200 నుంచి 300 వరకు ఉంటే కాలుష్య భరిత వాతావరణంగా చెబుతారు. ఏక్యూఐ 300 నుంచి 400 వరకు ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉన్నదని, ఏక్యూఐ 400 నుంచి 500 వరకు ఉంటే తీవ్రమైన వాయు కాలుష్యంగా చెప్తారు.
#WATCH | Drone visuals show a layer of haze over Signature Bridge and surrounding areas in Delhi this morning.
(Visuals shot at 7:50 am) pic.twitter.com/RiGIKpEYIK
— ANI (@ANI) November 26, 2023