పాట్నా: బీహార్‌లో కాల్పుల మోత మోగుతున్నది. తాజాగా ఒక న్యాయవాదిని దుండగులు కాల్చి చంపారు. (Lawyer shot dead) దీంతో గత 24 గంటల్లో కాల్పుల్లో నలుగురు మరణించడం కలకం రేపింది. పాట్నాలోని సుల్తాన్పూర్ ప్రాంతంలో నివసిస్తున్న 58 ఏళ్ల జితేంద్ర కుమార్ మహతో న్యాయవాది. ఆదివారం యథావిధిగా టీ తాగేందుకు రోజూ వెళ్లే షాపు వద్దకు అతడు వెళ్లాడు. టీ తాగిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన జితేంద్ర కుమార్‌ను హాస్పిటల్‌కు తరలించగా అతడు మరణించాడు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మూడు బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గత రెండేళ్లుగా న్యాయవాది వృత్తిలో చురుగ్గా లేడని పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న బీహార్‌లో గత 24 గంటల్లో కాల్పుల సంఘటనల్లో నలుగురు మరణించడం కలకలం రేపింది.
Also Read:
BJP Leader Shot Dead | బీజేపీ నేత హత్య.. కాల్పులు జరిపి చంపిన దుండగులు
Man Kills Son | హోటల్ రూమ్‌లో భార్యతో గొడవ.. ఆరేళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తండ్రి
Sena MLA Sanjay Shirsat | మంత్రి బెడ్రూమ్లో బ్యాగు నిండా నోట్ల కట్టలు.. వీడియో వైరల్