లక్నో: ఒక న్యాయవాది కేసు పరిష్కారం కోసం మహిళను పిలిపించాడు. కారులోకి ఎక్కించుకుని మద్యం తాగించాడు. హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. (Lawyer Rapes Woman) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 37 ఏళ్ల మహిళపై గతంలో జరిగిన అత్యాచారం కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నది. 55 ఏళ్ల న్యాయవాది జితేంద్ర నిందితుల తరపున కోర్టులో వాదిస్తున్నాడు. రాజీ కోసం ఆ మహిళను సంప్రదించాడు.
కాగా, నవంబర్ 6న ఈ కేసు పరిష్కారం కోసం చర్చించేందుకు న్యాయవాది జితేంద్ర ఆ మహిళను పిలిపించాడు. ఆమెను నమ్మించి కారులోకి ఎక్కించాడు. ఆ మహిళతో మద్యం తాగించాడు. మత్తులో ఉన్న ఆమెను హాటల్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు నవంబర్ 7న బాధిత మహిళ ఏక్తా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది జితేంద్రను ఆదివారం అరెస్ట్ చేశారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Model Dies | మోడల్ అనుమానాస్పద మృతి.. హాస్పిటల్లో వదిలేసి ప్రియుడు పరార్
Student Burns To Death | ఫీజు చెల్లించనందుకు పరీక్షకు నిరాకరణ.. నిప్పంటించుకుని విద్యార్థి మృతి
Watch: రైలు కోచ్‌లో స్నానం చేస్తూ యువకుడు రీల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?