ఎన్నారై పెండ్లిళ్లను రిజిస్టర్ చేయాలి
ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), భారత పౌరుల మధ్య వివాహాల్లో మోసాలు పెరుగుతుండటంపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
- మోసాల కట్టడికి సమగ్ర చట్టం తేవాలి: లా కమిషన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), భారత పౌరుల మధ్య వివాహాల్లో మోసాలు పెరుగుతుండటంపై లా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. వీటి కట్టడికి సమగ్ర చట్టం తేవాల్సిన అవసరమున్నదని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నారై, ఓసీఐ, భారత పౌరుల మధ్య వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని సూచించింది. ఈ మేరకు ఓ నివేదికను న్యాయ మంత్రిత్వ శాఖకు ప్యానెల్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) రితు రాజ్ అవస్థీ అందచేశారు.
ఎన్నారై వివాహాల్లో జరుగుతున్న మోసాల్లో ముఖ్యంగా భారతీయ మహిళలే అత్యధికంగా బాధితులని నివేదిక పేర్కొన్నది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు కమిషన్ గురువారం రాసిన కవరింగ్ లెటర్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇటువంటి చట్టాన్ని కేవలం ఎన్నారైలకే కాకుండా పౌరసత్వ చట్టం, 1955లో పేర్కొన్న ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లకు కూడా వర్తింప చేయాలని ప్యానెల్ సూచించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
Horoscope | 18-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
మంత్రులపై కుతంత్రం.. సీనియర్లపై కత్తి గట్టిన ముఖ్యమంత్రి రేవంత్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

