love jihad | మహారాష్ట్ర (Maharashtra)లోని మహాయుతి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘లవ్ జిహాద్’ ( love jihad) కేసులకు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సంజయ్ వర్మ నేతృత్వంలోని ప్యానెల్లో మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, హోమ్ వంటి కీలక శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్ని, ఇప్పటికే ఉన్న చట్టాలను అధ్యయనం చేసి ‘లవ్ జిహాద్’, మోసం, బలవంతపు మతమార్పిడిపై చర్యలను సూచించే ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తుంది. ఈ కమిటీ ‘లవ్ జిహాద్’ సంఘటనలకు సంబంధించిన చట్టపరమైన, సాంకేతిక అంశాలను పరిశీలించి సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది. ఆ తరువాత తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
కాగా, ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు లవ్ జిహాద్ నిరోధక చట్టాలను అమలు చేస్తున్నాయి.
Also Read..
Alcohol Consumers | మద్యం సేవించే మహిళలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువట.. ప్రభుత్వ సర్వేలో వెల్లడి
Maha Kumbh | మహా కుంభమేళా గడువు పొడిగించండి: అఖిలేష్ యాదవ్
Mood of The Nation Survey | ఇండియా కూటమి కొనసాగాలి.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి