Wayanad | ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ (Wayanad) జిల్లా పూర్తిగా ప్రభావితమైంది. జిల్లాలోని మెప్పడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే నాలుగు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 83 మంది మరణించగా.. 116 మంది గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం అర్థిస్తున్నారు.
ఈ విలయానికి ముందక్కాయి, చూరల్ మాలా (Chooralmala), అత్తమాల, నూల్‌పుజా గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక చూరల్ మాలా పట్టణం సగం తుడిచిపెట్టుకుపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. అక్కడ చలియార్ నదిలో చాలా మంది కొట్టుకుపోయారని పేర్కొంది. చూరల్ మాలాలో బ్రిడ్జ్ కూలిపోవడంతో సుమారు 400 కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. రంగంలోకి దిగిన కేరళ విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఆర్మీ చూరల్ మాలాలో సహాయక చర్యలు చేపడుతున్నాయి (rescue operation).
రోప్‌లను ఏర్పాటు చేసి వరదలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షిస్తున్నాయి. సుమారు 225 మంది సైనికులు ఆ ప్రాంతంలో మోహరించినట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు వైమానిక దళ హెలికాప్టర్లు, ఒక ఎమ్ఐ-17, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దింపారు. ఇప్పటి వరకూ వందల మందిని అధికారులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | Kerala: Latest visuals of the rescue operation in Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 70 people. pic.twitter.com/RGdix0ysc4
— ANI (@ANI) July 30, 2024
#WATCH | Kerala: Latest visuals of the rescue operation in Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 70 people. pic.twitter.com/hW5jSljBcb
— ANI (@ANI) July 30, 2024
#WATCH | Massive damage due to rain and landslide in Chooralmala area of Wayanad in Kerala; NDRF team carries out rescue operation pic.twitter.com/qIBQbKnLOw
— ANI (@ANI) July 30, 2024
#WATCH | Kerala: Latest visuals from the spot in Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 70 people.
Rescue operation underway. pic.twitter.com/cilEoUg04Z
— ANI (@ANI) July 30, 2024
#WATCH | Kerala: Latest visuals from the spot in rain-ravaged and landslide hit Chooralmala area of Wayanad.
The landslide claimed the lives of over 70 people. pic.twitter.com/f2r3MLm1ul
— ANI (@ANI) July 30, 2024
Also Read..
Wayanad Landslides | వయనాడ్ మృత్యు ఘోష.. నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ సర్కారు
MK Stalin | కేరళకు తమిళనాడు ప్రభుత్వం ఆపన్నహస్తం.. సీఎం నిధుల కింద రూ.5 కోట్లు విడుదల
Wayanad | 24 గంటల్లో 372 మిల్లీమీటర్ల వర్షపాతం.. వయనాడ్ విలయంలో 60 దాటిన మృతుల సంఖ్య