న్యూఢిల్లీ: గత వేసవి చాలా హాట్ గురూ అని పరిశోధకులు తేల్చారు. 2 వేల ఏండ్లలో ఎన్నడూ లేనంతగా 2023 వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పారిశ్రామికీకరణకు పూర్వంనాటి ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుత ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని 2015లో కుదిరిన పారిస్ ఒప్పందం పేర్కొంది. కానీ ప్రస్తుత ఉష్ణోగ్రతలు ఈ పరిమితిని మించిపోయినట్లు పరిశోధకులు తెలిపారు. 1850-1900 మధ్య వేసవి కాలాల్లోని ఉష్ణోగ్రతల సగటు కన్నా 2023లోని ఎండా కాలంలో 2.07 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు.