Laser Weapon System | భారత్ అమ్ముల పొదిలోకి సరికొత్త లేజర్ వెపన్ సిస్టమ్ చేరనున్నది. లేజర్ వెపన్ సిస్టమ్‌తో శత్రు డ్రోన్లు, క్షిపణులను కూల్చే సామర్థ్యాన్ని భారత్ సంపాదించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో తొలిసారిగా 30కేడబ్ల్యూ లేజర్ బేస్డ్ వెపన్ సిస్టమ్‌ని డీఆర్డీవో ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. అమెరికా, చైనా, రష్యా వద్ద ఈ టెక్నాలజీ ఇప్పటి వరకు మాత్రమే ఉండగా.. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ మాట్లాడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. ఈ విజయంలో డీఆర్డీవో అనేక లాబోరేటరీలు, ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కలిసి పని చేసినట్లు తెలిపారు. త్వరలోనే తాము గమ్యస్థానాన్ని చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాంకేతికత మనకు స్టార్ వార్స్‌లాంటి సామర్థ్యాన్ని ఇస్తాయన్నారు.
#WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… pic.twitter.com/fjGHmqH8N4
— ANI (@ANI) April 13, 2025
తనకు తెలిసినంత వరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే లేజర్ ఆయుధ వ్యవస్థను ప్రదర్శించాయన్నారు. ఇజ్రాయెల్ సైతం ఈ టెక్నాలజీపై పని చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా భారత ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) గురించి ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ కొత్త పాట్ఫామ్ని అభివృద్ధి చేసేందుకు పది నుంచి 15 సంవత్సరాలు పడుతుందన్నారు. సీసీఎస్ నుంచి ప్రాజెక్టుకు ఆమోదం పొందినత తర్వాత 2024లో ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని.. 2035 లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. AERO ఇంజిన్ ప్రాజెక్టును సైతం ప్రారంభించాలని అనుకుంటున్నామన్నారు. ఈ టెక్నాలజీ క్లిష్టమైందని.. ప్రమాదాలను తగ్గించేందుకు విదేశీ కంపెనీ OEMతో కలిపి పని చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. నాల్గో తరం ఇంజిన్ కావేరి నుంచి చాలా నేర్చుకున్నామని.. కానీ, ప్రస్తుతం ఈ ఇంజిన్ టెక్నాలజీ సిక్త్ జనరేషన్‌కి మారిందన్నారు. ప్రమాదాలను తగ్గించడానికి DRDO ఒక విదేశీ కంపెనీతో కలిసి పనిచేయాలనుకుంటుందన్న ఆయన.. రాబోయే కొన్ని నెలల్లో ఈ విషయంలో కొన్ని శుభవార్తలు వింటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
#WATCH | Kurnool, Andhra Pradesh: DRDO Chairman Dr Samir V Kamat says, “…This is just the beginning of the journey. The synergy that this lab has achieved with other DRDO labs, industry and academia, I am sure we will reach our destination soon… We are also working on other… https://t.co/toO7xuAo9K pic.twitter.com/VjC9tS6WGF
— ANI (@ANI) April 13, 2025