న్యూఢిల్లీ: ఆది కైలాస పర్వతానికి వెళ్లే మార్గంలో కొండ చరియ విరిగిపడడంతో ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. మార్గాన్ని పూర్తిగా కొండ చరియ కప్పేయడంతో యాత్రికులు, స్థానికులు ముందుకు పోలేక అక్కడే చిక్కుకుపోయారు.
సరిహద్దు రోడ్ల సంస్థ(బీఆర్ఓ) సిబ్బంది శిథిలాలను తొలగించి సాధ్యమైనంత త్వరలో రోడ్డును పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ ప్రాంతంలో ఉన్న ఆది కైలాస పర్వతాన్ని సందర్శించేందుకు హిందువులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.