Landslides | జమ్మూ కశ్మీర్లోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. సోమవారం ఉదయం పనార్ వంతెన చండిమార్ సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు రోడ్డుపై పడిన కొండచరియలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా జమ్మూలోని రాజౌరి – పూంచ్ (Poonch) జిల్లాలను కశ్మీర్ లోయతో కలిపే మొఘల్ రహదారిని మూసివేశారు (Mughal Road closed). ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలోపెట్టుకుని ప్రజలు కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించొద్దని సూచిస్తున్నారు.
Rajouri landslide: Rajouri Me Bhayanak landslide Hua, landslide Se Mugal Road Band, Panar Bridge Chandimar Ke Pass Hua landslide, landslide Se Jaan Maal Ka Nuksan Nhi#landslide #rajouri #mugalroad pic.twitter.com/IXlJKtLUwj
— Shoib Salmani (@shoibsalmani98) July 8, 2024
Also Read..
Hemant Soren | విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్.. నేడు కేబినెట్ విస్తరణ
Rath Yatra | రెండో రోజు శోభాయమానంగా జగన్నాథ రథయాత్ర.. డ్రోన్ విజువల్స్
Kim Yo Jong | అలా చేస్తే విధ్వంసమే.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్