Kim Yo Jong | ఉత్తర కొరియా (North Korea), దక్షిణ కొరియా (South Korea) మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. రెండు దేశాలు సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలతో తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ కొరియా లైవ్ ఫైర్ డ్రిల్స్ (Military Drills) చేపట్టింది. ఉత్తర కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవుల్లో ఈ డ్రిల్స్‌ను చేపట్టింది. దీనిపై కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సోదరి, ఉత్తర కొరియాలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేపట్టడం తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ఆత్మహత్యా సదృశ్యమేనని పేర్కొన్నారు. తమను రెచ్చగొడితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సౌత్ కొరియా డ్రిల్స్‌కు జవాబు చెప్పే పనిలో తమ సైనిక బలగాలు నిమగ్నమయ్యాయని పేర్కొన్నారు. కిమ్ యో జాంగ్ స్టేట్ మెంట్‌ను ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ రిలీజ్ చేసింది.
దక్షిణ కొరియాపై ‘చెత్త’ దాడి..
కాగా, ఇటీవలే పొరుగున ఉన్న దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ‘చెత్త’ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పెద్దయెత్తున చెత్త, ఇతర విసర్జకాలతో ఉన్న మూటలతో కూడిన బెలూన్లను సరిహద్దు వెంబడి ఎగురవేసి దక్షిణ కొరియా గనగతలంలోకి పంపింది. సుమారు 150 భారీ బెలూన్లను దక్షిణ కొరియా అధికారులు గుర్తించారు. దక్షిణ కొరియాలోని సుమారు 8 ప్రావిన్సుల్లో ఆ బెలూన్లను గుర్తించారు. ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలంటూ సౌత్ కొరియా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కొరియా వదిలిన తెలుపు రంగు బెలూన్లను ఎవరూ టచ్ చేయరాదు అని దక్షిణ కొరియా మిలిటరీ తన వార్నింగ్‌లో పేర్కొన్నది. కొరియా యుద్ధం జరిగిన 1950 నుంచి రెండు దేశాల మధ్య బెలూన్లను తమ ప్రచారం కోసం వాడుకునేవారు. బోర్డర్ ప్రాంతాల్లో కరపత్రాలను దక్షిణ కొరియా జారవిడుస్తోందని, అలా చేస్తే తాము ఊరుకోబోమని ఉత్తర కొరియా ఇటీవల వార్నింగ్ కూడా ఇచ్చింది.
Also Read..
PM Modi | మోదీ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యతో ఉన్నాయి.. రష్యా వ్యాఖ్యలు
Rath Yatra | భక్తులతో కిక్కిరిసిన పూరి క్షేత్రం.. రెండో రోజు ప్రారంభమైన రథయాత్ర