PM Modi | ప్రధాన మంత్రి మోదీ (PM Modi) నేడు రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్పై మాస్కో యుద్ధం తర్వాత మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర పుతిన్ ఆహ్వానం మేరకు ఇవాళ, రేపు (8 ,9 తేదీల్లో) మోదీ రష్యాలో పర్యటించనున్నారు. అక్కడ 22వ భారత్ – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 10వ తేదీ ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
కాగా, మోదీ పరట్యనకు ముందు రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. ఈ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యతో ఉన్నాయని (West Watching With Jealousy) వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శిఖరాగ్ర స్థాయి చర్చలు చేపడతారని వెల్లడించింది. కాగా, ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోను ప్రధాని మోదీ సందర్శించడం ఇదే తొలిసారి. అదేవిధంగా.. భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
Also Read..
Rath Yatra | భక్తులతో కిక్కిరిసిన పూరి క్షేత్రం.. రెండో రోజు ప్రారంభమైన రథయాత్ర
Children Injured | అదుపు తప్పి బోల్తాపడిన బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు
YS Jagan | ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం.. వైఎస్ జగన్ భావోద్వేగం