ముంబై, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ నిబంధనలను ఉల్లంఘించి డిపార్ట్మెంట్కు చెందిన 15 ఎకరాల స్థలాన్ని విక్రయించినందుకు ఒక మహిళా అధికారిని సస్పెండ్ చేశారు.
సబ్ రిజిస్ట్రార్ సహా 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుణె నగరానికి సమీపంలోని పింప్రి చించ్వాడ్లోని తథావాడే ప్రాంతంలో ఉన్న ఈ భూమిని బదిలీ చేయకూడని ఆస్తిగా వర్గీకరించినప్పటికీ అధికారులు, బిల్డరు కుమ్మక్కు అయ్యి రూ.33 కోట్లకు అమ్ముకున్నారు.