న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, కూతురు హేమా యాదవ్కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. మార్చి 11 లోపు తన ముందు హాజరు కావాలని ప్రత్యేక జడ్జి విశాల్ గొగ్నె సమన్లలో పేర్కొన్నారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో(2004-2009), రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు అభ్యర్థుల నుంచి భూములు తీసుకొన్నారన్న ఆరోపణలపై వీరి మీద కేసు నమోదైంది.