Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అనారోగ్యంతో ఆసుపత్రిలో (hospitalised) చేరారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు పాట్నా విమానాశ్రయానికి (Patna airport) బయల్దేరారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పాట్నా (Patna)లోని పరాస్ ఆసుపత్రి (Paras Hospital)లో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. లాలూ ప్రసాద్ యాదవ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన్ని ఈరోజు సాయంత్రం ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
#WATCH | Patna, Bihar: RJD leader and former CM Rabri Devi reaches Paras Hospital to meet her husband and former CM Lalu Prasad Yadav, who has been admitted here after his health deteriorated. pic.twitter.com/dNtpam7FG5
— ANI (@ANI) April 2, 2025
Also Read..
Akash Ambani | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆకాశ్ అంబానీ
Waqf Bill | లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ బిల్లు.. 8 గంటల పాటూ జరగనున్న చర్చ