Lalan Singh elected JD(U) national President : జనతాదళ్ (యు) జాతీయాధ్యక్షుడిగా లాలన్‌సింగ్
Lalan Singh elected JD(U) national President : జనతాదళ్ (యునైటెడ్) జాతీయాధ్యక్షుడిగా రాజీవ్‌రంజన్ సింగ్ అలియాస్ లాలన్‌సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియమాకాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం సాయంత్రం ప్రకటించారు

పాట్నా : జనతాదళ్ (యునైటెడ్) జాతీయాధ్యక్షుడిగా రాజీవ్‌రంజన్ సింగ్ అలియాస్ లాలన్‌సింగ్ (Lalan Singh elected JD(U) national President) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియమాకాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం సాయంత్రం ప్రకటించారు. న్యూఢిల్లీ జంతర్ మంతర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముంగేర్ నుంచి ఎంపీగా ఉన్న లాలన్‌సింగ్.. నితీష్ కుమార్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. రామచంద్ర ప్రసాద్ స్థానంలో లాలన్సింగ్ను నియమించారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రామచంద్ర ప్రసాద్‌కు మంత్రి పదవి లభించింది. దాంతో జేడీ(యూ) జాతీయాధ్యక్ష పదవికి లాలన్సింగ్ను నియమించడం అనివార్యమైంది.
1980 ల నుంచి నితీష్ కుమార్‌కు నమ్మిన వ్యక్తిగా లాలన్‌సింగ్ ఉన్నారు. ఇటీవల స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్‌తోపాటు ఎల్జేపీ ఏకైక ఎమ్మెల్యే రాజ్ కుమార్ సింగ్‌ను జేడీయూలోకి తీసుకువచ్చిన ఘనత లాలన్సింగ్దే. చిరాగ్ పాశ్వాన్ నుంచి పార్టీ నాయకత్వాన్ని పశుపతి నాథ్ పరాస్ లాక్కోవడం ద్వారా ఎల్జేపీని విచ్ఛిన్నం చేయడం వెనుక సూత్రధారులలో ఒకరిగా లాలన్‌సింగ్ కూడా ఉన్నారని రాజకీయ నిపుణులు చెప్తుంటారు. ఇలాఉండగా, లాలన్ సింగ్ కేంద్ర క్యాబినెట్ పదవికి ముందు వరుసలో ఉండి.. జేడీయూ జాతీయ అధ్యక్ష పదవి అనే కన్సోలేషన్ ప్రైజ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: బాబుల్ సుప్రియో
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. విషెస్ చెప్పిన హార్దిక్, నటాషా
అమ్మకు ప్రేమతో.. తల్లితో అనుష్క శెట్టి
పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ కళాకారుడు నామినేట్
వాట్సాప్‌పై కేసు పెట్టిన రష్యా.. ఎందుకంటే..?
45 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయిన ఐఎస్ఎస్
టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

