Ayodhya Ram Mandir | అయోధ్య: యూపీలోని అయోధ్య రామాలయం నిర్మాణానికి కూలీల కొరత ఏర్పడింది. వాస్తవానికి ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్‌కు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, దానిని సెప్టెంబర్‌కు పొడిగించారు.
మొదటి అంతస్తులో ఏర్పాటు చేయాల్సిన కొన్ని ప్రత్యేక రాళ్ల ఏర్పాటుకు సుమారు 200 మంది పనివారి కొరత ఉన్నందున నిర్మాణం పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతున్నట్టు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.