న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికల యూజర్లకు కేవైసీ (నో యువర్ కస్టమర్) పరిశీలన తప్పనిసరి చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఆన్లైన్లో మహిళలు, మైనర్లకు రక్షణ కల్పించేందుకు ఇది తప్పక అమలు చేయాలని పేర్కొన్నది.
సైబర్ నేరం, సైబర్ రక్షణపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ హోం శాఖ, సమాచార ప్రసార శాఖకు తన ప్రతిపాదనలను అందజేసింది.