Kuwait Fire | 45 మంది భారతీయుల భౌతికకాయాలతో కువైట్ నుంచి బయల్దేరిన భారత వైమానిక దళానికి చెందిన విమానం (IAF Aricraft ) కేరళకు చేరుకుంది. ఉదయం 11 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. కేరళకు చెందిన 12 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన మూడు మృతదేహాలను కొచ్చిలో దింపేసి ఈ విమానం తిరిగి ఢిల్లీకి బయల్దేరనుంది. ఇప్పటికే విమానాశ్రయం వద్ద అధికారులు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మృతులకు ఎయిర్‌ఫోర్ట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించనున్నారు.
కువైట్‌లోని మంగఫ్ సిటీలో బుధవారం ఉదయం 6 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్బీటీసీకి చెందిన 6 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో అక్కడికక్కడే 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 45 మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు. వంట గదిలో ప్రమాదం జరిగిందని, అనంతరం మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఇరుక్కుపోయి అక్కడ వెలువడిన పొగ పీల్చడం వల్ల పలువురు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తున్నది.
భవనంలో దాదాపు 160 మంది కార్మికులు పని చేస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిని కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించి సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన భవనంలో కార్మికులు కిక్కిరిసి ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
#WATCH | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport.
(Source: CIAL) pic.twitter.com/UKhlUROaP7
— ANI (@ANI) June 14, 2024
#WATCH | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport.
(Source: CIAL) pic.twitter.com/d42RBDAVNz
— ANI (@ANI) June 14, 2024
#WATCH | Ernakulam, Kerala: The mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait being taken out of the special Indian Air Force aircraft at Cochin International Airport.
(Source: CIAL) pic.twitter.com/Dsn8hHhcqS
— ANI (@ANI) June 14, 2024
Also Read..
Monsoon Session | జులై 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మోడీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్
T20 World Cup: సూపర్-8లోకి ఆఫ్ఘనిస్తాన్.. న్యూజిలాండ్ ఔట్