Sai Pallavi | మూవీ లవర్స్‌కు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ సాయిపల్లవి. ఈ కోలీవుడ్ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇక హిందీలో కూడా సాయిపల్లవి తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతుందని తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తోన్న మేరే రహో సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ఫైనల్ చేశారన్న వార్త బయటకు వచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం మేరే రహో చిత్రాన్ని జులై రెండో వారంలో విడుదల చేయబోతున్నారట. రిలీజ్ డేట్‌పై మేకర్స్ రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారని బీటౌన్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. మొత్తానికి సాయిపల్లవి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హిందీ డెబ్యూ మూవీ ఈ ఏడాది సెకండాప్లో థియేటర్లలో సందడి చేయనుందన్న వార్తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
2025లో తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సాయిపల్లవి. ఈ భామ ఖాతాలో మరో మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ రామాయణ ఉంది. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుంది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న మేరే రహో మూవీని సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు.