రామగిరి, ఫిబ్రవరి 16 : ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్న తెలంగాణ సాహితీ దశాబ్ధి ఉత్సవాల పోస్టర్ను సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డి.మునుస్వామి, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ టంగుటూరి సైదులు, డాక్టర్ వేముల వెంకటేశం, ఎన్.కోటయ్య, జి.గోవర్ధనగిరి, ఎస్.ప్రభాకర్, డి.అంజయ్య, తెలంగాణ సాహితీ జిల్లా కోశాధికారి తరునోజు భీష్మాచార్య, పందిరి శ్యాంసుందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుకుడాల గోవర్ధన్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న డిగ్రీ, పీజీ విద్యార్థులకు ‘డ్రగ్స్ రహిత సమాజం సుస్థిర భవిష్యత్’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు తాము రాసిన వ్యాసాన్ని సంబంధిత కళాశాలల తెలుగు శాఖలో ఈ నెల 19 వరకు అందజేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, రెండు కన్సోలేషన్ బహుమతులు హైదరాబాద్లో జరిగే దశాబ్ది ఉత్సవాల్లో అందజేయబడతాయని పేర్కొన్నారు.