Mallikarjun Kharge | ఈ ప్రపంచం డొనాల్డ్ ట్రంప్ ముందు మోకరిల్లదు : మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge | ప్రస్తుతం వెనెజువెలా (Venezuela) లో నెలకొన్న పరిస్థితి ఈ ప్రపంచానికి మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు.
Mallikarjun Kharge : ప్రస్తుతం వెనెజువెలా (Venezuela) లో నెలకొన్న పరిస్థితి ఈ ప్రపంచానికి మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ప్రపంచంలోని జనాభాను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.
ఎవరు రాజ్య విస్తరణకు ప్రయత్నించినా దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరని ఖర్గే అన్నారు. హిట్లర్, ముస్సోలినీ లాంటి వాళ్లు కూడా అలాంటి ప్రయత్నాలు చేసి కనుమరుగై పోయారని చెప్పారు. కొంతమంది కుటిల ఆలోచనలతో ప్రపంచ శాంతిని చెడగొట్టేందుకు ప్రయత్నించడం మంచిది కాదని అన్నారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ ఎప్పుడూ చెబుతుంటాడని, ఇప్పటివరకు దాదాపు 70 సార్లు ఈ విషయం చెప్పాడని తెలిపారు.
ఈ ప్రపంచంలో తానే అత్యంత గొప్ప వ్యక్తినని, ఈ ప్రపంచం తనముందు మోకరిల్లుతుందనేది ట్రంప్ మాటలకు అర్థమని ఖర్గే చెప్పారు. కానీ ట్రంప్ ముందు మోకారిల్లాల్సిన అవసరం ఈ ప్రపంచానికి లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముందుకు పోతామని వ్యాఖ్యానించారు. ‘బతుకు, బతుకనివ్వు’ అనేది నెహ్రూ పాలసీ అని, అదే మా పాలసీ కూడా అని చెప్పారు.
ఇవాళ ట్రంప్ మాట్లాడిన ఒక ఆడియో విన్నానని, ‘మోదీకి నేనంటే గౌరవమని, నా మాట వింటాడని నాకు తెలుసు’ అన్నది ఆ ఆడియో సారాంశమని ఖర్గే అన్నారు. అంటే మోదీ తన కంట్రోల్లో ఉన్నాడనేది దీని అర్థమా..? అని ఆయన ప్రశ్నించారు. మోదీ ఎందుకు ట్రంప్ ముందు బెండ్ అవుతున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఇది దేశానికి ప్రమాదకరమని చెప్పారు. నిన్ను ప్రజలు ప్రధానిగా ఎన్నుకున్నది ట్రంప్ చెప్పినట్లు తలూపడానికి కాదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

