Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సిర్సా ఎంపీ కుమారి సెల్జా ఆశాభావం వ్యక్తం చేశారు. హరియాణలో ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయాలా వద్దా అనే విషయంలో పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు.
పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇక రాజీవ్ గాంధీ ప్రేరణతోనే తాము రాజకీయాల్లోకి వచ్చామని ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ఎదిగామని చెప్పారు. గతంలో రాజీవ్ నాయకత్వం పట్ల యువత ఆకర్షితులవగా, ఇప్పుడు రాహుల్ గాంధీ యువతలో స్ఫూర్తి నింపుతున్నారని అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరియాణలో జన్నాయక్ జనతా పార్టీ (JJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జేజేపీ సీనియర్ నేత పలరాం సైని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో జేజేపీ నుంచి పోటీ చేశానని, తన విజయానికి పార్టీ శ్రేణులు కలిసిరాలేదని చెప్పారు. కైథాల్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో జేజేపీ జిల్లా అధ్యక్షుడు రణదీప్ కౌల్ పార్టీకి, తనకు మద్దతు తెలపలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :