Rajinikanth | తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్ (93) బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ ఆయన మృతి పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు.
ఇవాళ చెన్నై ఎయిర్ పోర్టులో రజినీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. కుమారి అనంతన్ నిజాయితీ గల రాజకీయ వేత్త అని, గొప్ప మానవతావాది అన్నారు. తమిళిసై కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. కుమారి అనంతన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
కాగా మరోవైపు ఇవాళ అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అజిత్ కుమార్ టీంకు విషెస్ తెలియజేశాడు తలైవా.
Chennai | On the demise of BJP leader Tamilisai Soundararajan’s father and senior Congress leader Kumari Ananthan, Actor Rajinikanth says, “Kumari Ananthan was an honest politician and a great human. I extend my condolences to his family.” pic.twitter.com/pgnHn6vN7T
— ANI (@ANI) April 10, 2025
Chennai | On the release of Actor Ajith’s movie ‘Good Bad Ugly,’ actor Rajinikanth says, “Best wishes for Ajith’s movie.” https://t.co/o1qWEbgYeh pic.twitter.com/LPsI9vT3zz
— ANI (@ANI) April 10, 2025