కోల్కతా, సెప్టెంబర్ 10: కోల్కతా ఆర్జీ కర్ దవాఖాన హత్యాచార ఘటనపై నిరసన చేపడుతున్న జూనియర్ డాక్టర్లు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. మంగళవారం ఐదు గంటల్లోపు విధుల్లోకి చేరాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ ఆందోళన కొనసాగించారు. 32వ రోజైన మంగళవారం కూడా విధులు బహిష్కరించి తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు, సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి చర్చలకు రావాల్సిందిగా జూనియర్ డాక్టర్లను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆహ్వానించారు. దీనిని జూనియర్ డాక్టర్లు తిరస్కరించారు.
మలయాళ సినీ పరిశ్రమలో మహిళల వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి చర్య తీసుకోకుండా స్తబ్దుగా, నిష్క్రియాత్మకంగా ఉండటం పట్ల కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నివేదిక ఇచ్చిన నాలుగేండ్ల తర్వాత మాత్రమే చర్యలు ప్రారంభించిందని, ఇన్నాళ్లూ ప్రభుత్వం ఏం చేసిందనిజస్టిస్లు ఏకే జయశంకరన్ నంబియార్, సీఎస్ సుధాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. వెంటనే కమిటీ పూర్తి నివేదికను (సిట్)కు అప్పగించాలని ఆదేశించింది
దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా చలన చిత్ర పరిశ్రమపై వచ్చిన ఆరోపణలపై తమ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని వేసి ఆదర్శంగా నిలిచిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.