Raids : మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్కతా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Kolkata DCP) శంతన్ సిన్హా బిస్వాస్ (Shantan Sinha Biswas) ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు దాడులు చేశారు. ఆయనతోపాటు మరికొందరికి చెందిన ఆస్తులపై కూడా దాడులు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
స్థానిక నేరగాడు విశ్వజిత్ పొద్దార్కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తొలిసారి చేసిన తనిఖీల్లో ఈడీ రూ.1.47 కోట్ల నగదు.. రూ. 67.64 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. పొద్దార్ వ్యవస్థీకృత నేర ముఠాతో సంబంధాలు పెట్టుకుని.. అక్రమ వ్యాపారాలు, బెదిరింపులు, అల్లర్లు సృష్టించడం వంటివి చేస్తున్నట్లు ఈడీ పేర్కొంది.