Vishnuvardhan | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : ఢిల్ల్లీలోని ఎర్రకోటలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రాంటెంకి విష్ణువర్ధన్ హాజరయ్యాడు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ వికసిత్ భారత్ ప్రేరణతో గత ఏప్రిల్ 10న 9 నుంచి ఇంటర్ విద్యార్థులకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సత్తా చాటి రాష్ట్రం నుంచి బాలుర విభాగంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన జాతీయ విద్యాసదస్సుకు ఎంపికయ్యాడు. ఢిల్ల్లీలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని సైతం దక్కించుకున్నాడు. విష్ణువర్ధన్‌కు డీఈవో యాదయ్య, ఎంఈవో విజయ్‌కుమార్, హెచ్ఎం రాజన్న, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
మరిన్ని వార్తలు..
నడుస్తున్న రైలు నుంచి విడిపోయిన రెండు బోగీలు
సూరత్: గుజరాత్‌లోని సూరత్ సమీపంలో గురువారం అనూహ్య సంఘటన జరిగింది. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు బోగీలు విడిపోయాయి. సాయన్, సూరత్ రైల్వే స్టేషన్ మధ్యలోని గొఠంగామ్ వద్ద గురువారం ఉదయం 8.50 గంటలకు ఈ సంఘటన జరిగింది. విడిపోయిన బోగీలను తిరిగి రైలుకు జత చేశారు. ఇతర రైళ్లను లూప్ లైన్లో నడిపారు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. రైళ్ల రాకపోకలను ఉదయం 11.22 గంటలకు పునరుద్ధరించినట్లు వెస్టర్న్ రైల్వేస్ సీపీఆర్ఓ వినీత్ అభిషేక్ చెప్పారు.
జమ్ముకశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ డీజీపీగా ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులు కాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. జమ్ముకశ్మీరు ప్రస్తుత డీజీపీ ఆర్ఆర్ స్వెయిన్ వచ్చే నెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు.
నేడే ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగం
శ్రీహరికోట, ఆగస్టు 15: చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయటం, అందుకు అనుకూలమైన పేలోడ్ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో చేపట్టిన ‘ఎస్ఎస్ఎల్వీ-డీ3’ మిషన్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.19 గంటలకు ప్రయోగిస్తున్న రాకెట్ కౌంట్‌డౌన్ మొదలైంది. ‘ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్’ ఈవోఎస్-08ను తక్కువ ఎత్తులోని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్ లక్ష్యం. దాదాపు 6 నెలల తర్వాత ఇస్రో చేపడుతున్న రాకెట్ ప్రయోగమిది. కేవలం రెండు రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్‌ను తక్కువ ఖర్చుతో భూ కక్ష్యలోకి చేర్చేందుకు ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్‌తో సాధ్యమవుతుందని ఇస్రో మాజీ సైంటిస్టు ఒకరు చెప్పారు.