Encounter | జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. చత్రు ప్రాంతంలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ నెల 9 నుంచి కిష్త్వార్లో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా.. ఎట్టకేలకు శుక్రవారం ఓ ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు.. బుధవారం కిష్త్వార్లోని చత్రు అటవీ ప్రాంతంలో పోలీసులతో కలిసి భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేపట్టాయి. ఇదే క్రమంలో ఉగ్రవాదులు అదే రోజు సాయంత్రం ఎన్కౌంటర్ మొదలైంది. దాంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అప్పటి నుంచి దాక్కుంటూ వచ్చిన ఉగ్రవాదిని శుక్రవారం బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇతర ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.