న్యూఢిల్లీ : అంతర్జాతీయ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుదైన వీడియో (Viral Video)ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చెట్ల కొమ్మలపై పలు ఆడ సింహాలు లేజీగా కూర్చునిఉన్న వీడియోను కేంద్ర మంత్రి షేర్ చేశారు.
Greetings to all on the occasion of #WorldWildlifeDay!#PartnershipsforConservation #TogetherAgainstWildlifeCrime#WWD2023 pic.twitter.com/E8qgCSCu3h
— Kiren Rijiju (@KirenRijiju) March 3, 2023
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసినప్పటి నుంచి 22,600 మందికిపైగా వీక్షించారు. ఈ వీడియో చాలా వినూత్నంగా, ఆకట్టుకునేలా ఉందని పలువురు ట్విట్టర్ యూజర్లు పేర్కొన్నారు. లొకేషన్ ఎక్కడ ఉందని చాలా మంది యూజర్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశ్నించారు.
Read More :