Sudha Murty | ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty)కి చెందిన ఓ ఆసక్తికర వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ వేడుకలో సుధామూర్తి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా కాలుకదిపి అందరినీ ఆకట్టుకున్నారు.
బయోకాన్ (Biocon) లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా (Kiran Majumdar Shaw) మేనల్లుడు ఎరిక్ మజుందార్ (Eric Mazumdar) పెళ్లి బెంగళూరు (Bengaluru)లో ఘనంగా జరిగింది. వివాహ వేడుకలో భాగంగా నగరంలోని తాజ్ వెస్ట్‌లో బుధవారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు ఎంపీ సుధామూర్తి కూడా వచ్చారు. ఈ సందర్భంగా కిరణ్ మజుందార్‌తో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Bomb Threat | ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపులు
Al-Falah University | ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్ భవనం.. పథక రచన మొత్తం ఆ గది నుంచే..!