భువనేశ్వర్: ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లంసల్ ఆదివారం అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు కేఐఐటీ వర్గాలు తెలిపాయి.
ఈ సంఘటనపై నిరసన తెలిపిన సుమారు 500 మంది నేపాలీ విద్యార్థులను హాస్టల్ నుంచి ఖాళీ చేయించి, పంపించేశారు. నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి ఫేస్బుక్ పోస్ట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, దౌత్య మార్గాల్లో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.