Sugarcane | న్యూఢిల్లీ, అక్టోబర్ 23: వ్యవసాయ కూలీలకు మూత్రపిండాల వ్యాధులు సంక్రమించడానికి ఇతర కారణాలతో పాటు మరో కారణం కనిపిస్తున్నది. చెరకు తోటలోని వ్యర్థాలను, వరి చేలలోని ఊక, దుబ్బులను కాల్చడం వల్ల విడుదలయ్యే విషపూరిత పదార్థాలు కిడ్నీ వ్యాధులకు దారి తీస్తున్నట్లు తెలుస్తున్నది. భారతదేశం, శ్రీలంక, అమెరికా వంటి దేశాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన బృందం అధ్యయనంలో వెల్లడైంది.