Delhi Police | ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న పదేళ్ల బాలికను కిడ్నాప్, హత్యాచారం చేసిన క్యాబ్ డ్రైవర్.. నిందితుడు అరెస్ట్
Delhi Police : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు ఒక క్యాబ్ డ్రైవర్. ఆ తర్వాత ఆ బాలికను అడవుల్లో పారేశాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీ పరిధిలోని సీడీఆర్ చౌక్ ఏరియా సమీపంలో సోమవారం ఉదయం జరిగింది.
Delhi Police : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు ఒక క్యాబ్ డ్రైవర్. ఆ తర్వాత ఆ బాలికను అడవుల్లో పారేశాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీ పరిధిలోని సీడీఆర్ చౌక్ ఏరియా సమీపంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, సీడీఆర్ చౌక్ సమీపంలో పదేళ్ల బాలిక కుటుంబంతో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా సోమవారం ఉదయం ఐదు గంటల సమయంలో బబ్లూ అనే క్యాబ్ డ్రైవర్ ఆ బాలికను ఎత్తుకెళ్లాడు.
తన కార్లో బలవంతంగా ఎక్కించుకుని గుర్గావ్ (గురుగ్రామ్) ప్రాంతంలోకి ఎక్కించుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక వల్ల ఎక్కడ నిజం బయటపడుతుందో అని భావించిన బబ్లూ ఆ బాలికను చంపేశాడు. తర్వాత ఆధారాలు దొరకకుండా బాలిక మృతదేహాన్ని గుర్గావ్-ఫరిదాబాద్ రోడ్డు మార్గంలో, మెహ్రౌలి ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో వదిలేశాడు. ఈ ఘటనపై ఉదయం పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆరు గంటల్లోనే నిందితుడు బబ్లూను అరెస్టు చేశారు. అలాగే, బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బబ్లూ తానే నేరం చేసినట్లు అంగీకరించాడు.
బాలిక ఆచూకీ కోసం అనేక టీంలు ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వందలాది సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించామన్నారు. నిందితుడిపై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

